వివాహేతర సంబంధమే హత్యకు కారణం

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

_భార్యతో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
_మేడిపల్లి పోలీసుల సంచలన కేసు ఛేదింపు

బోడుప్పల్, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు భార్య చేతిలో భర్త హత్యకు సంబంధించిన సంచలన కేసును విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో మృతుడి భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె. అశోక్ (45), శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, డిసెంబర్ 11న తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. డిసెంబర్ 12న మృతుడి భార్య జె. పూర్ణిమ ఫిర్యాదు చేస్తూ, తన భర్త బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడని, మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మృతిగా ప్రకటించినట్లు పేర్కొంది. మొదట ఎలాంటి అనుమానాలు లేకపోయినా, మృతదేహంపై చెంప, మెడపై గాయాలు గుర్తించడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల పరిశీలనలో పూర్ణిమకు అదే కాలనీలో నివసించే పలేటి మహేష్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం మృతుడికి తెలియడంతో భార్యను ప్రశ్నించడం, వేధించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఇదే హత్యకు కారణంగా మారినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల కథనం ప్రకారం, డిసెంబర్ 11న సాయంత్రం మృతుడు ఇంటికి వచ్చిన వెంటనే మహేష్ (ఏ-2) మరియు సాయి కుమార్ (ఏ-3) అతడిని పట్టుకోగా, పూర్ణిమ (ఏ-1) కాళ్లు పట్టుకుంది. అనంతరం మూడు చున్నీలతో గొంతు నులిమి హత్య చేశారు. హత్య అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించేందుకు మృతుడి దుస్తులు మార్చి, ఆధారాలను నాశనం చేసినట్లు తెలిపారు.నిందితుల వద్ద నుంచి ఐఫోన్-15 మొబైల్ ఫోన్, రక్తపు మరకలున్న చున్నీలు, దుస్తులు, మృతుడి పగిలిన పళ్ళు, నేరానికి సంబంధించిన ఫోటోలు–వీడియోల తో కూడిన పెన్ డ్రైవ్, ప్యాషన్ ప్రో ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.నిందితులందరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ మరియు శాస్త్రీయ ఆధారాలతో కేసును మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఐపీఎస్ నాయకత్వంలో, మల్కాజిగిరి జోన్ డీసీపీ సిహెచ్. శ్రీధర్ ఐపీఎస్, ఏసీపీ ఎస్. చక్రపాణి పర్యవేక్షణలో, మేడిపల్లి ఎస్హెచ్ఓ ఆర్. గోవింద రెడ్డితో పాటు పోలీస్ బృందం విజయవంతంగా ఛేదించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం