పెద్దమందడి గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారానికి

ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరు

పెద్దమందడి గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారానికి

పెద్దమందడి,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన సూర్య గంగమ్మ రవి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే మేఘా రెడ్డి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా సమిష్టిగా పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సూర్య గంగమ్మ రవి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .