వెల్టూర్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం
ఆర్. పెద్ద శ్రీనివాస్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు
పెద్దమందడి,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అశోక్ (చిట్టి) మరియు ఉప సర్పంచ్ బోయిని పద్మలను పెద్దమందడి టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్. పెద్ద శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరినీ శాలువాలతో సత్కరించి గ్రామ పాలన బాధ్యతలను ప్రజల ఆశలకు అనుగుణంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామాభివృద్ధిలో సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ బోయిని పద్మల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. వెల్టూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
నూతన సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ బోయిని పద్మ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు.


Comments