చిల్కానగర్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే బండారి – కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్‌లోని పలు కాలనీలు, బస్తీల్లో మొత్తం రూ.1 కోటి 79 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమం లో భాగంగాసాయిరాం నగర్ బ్యాంక్ కాలనీలో రూ.96 లక్షలతో బాక్స్ డ్రైన్ నిర్మాణానికి,బీరప్పగడ్డ సౌత్ ప్రశాంత్ నగర్, బొమ్మల బస్తిలో రూ.10.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి,బీరప్పగడ్డ అక్రమ్ ఇంటి ఎదురుగా రూ.19.50 లక్షలతో సీసీ రోడ్డు మరియు స్టార్మ్ వాటర్ డ్రైన్ పైప్‌లైన్‌కు,కుమారి కుంటలో రూ.24 లక్షలతో స్టార్మ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్‌కు,చిల్కానగర్ శివాలయం పక్కన వీధిలో రూ.29 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, చిల్కానగర్ డివిజన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని దశలవారీగా నెరవేరుస్తూ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ప్రాంతాల వారీగా అమలు చేస్తూ చిల్కానగర్ డివిజన్‌లో నిధుల వరద ప్రవహించేలా చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.110 కోట్లతో చిల్కానగర్ డివిజన్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీనాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


Comments