జిహెచ్ఎంసి అధికారులతో అభివృద్ధి పనులు వేగవంతంపై సమీక్ష కార్పొరేటర్ బన్నాల

జిహెచ్ఎంసి అధికారులతో అభివృద్ధి పనులు వేగవంతంపై సమీక్ష కార్పొరేటర్ బన్నాల

చిల్కానగర్, డిసెంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ చిల్కానగర్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులకు తక్షణమే నూతన ప్రతిపాదనలు సిద్ధం చేసి జాప్యం లేకుండా అమలు చేయాలని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆదేశించారు.బన్నాల గీతా ప్రవీణ్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే టెండర్ అయిన పనులకు శంకుస్థాపన జరిపి వెంటనే కాంట్రాక్టర్లతో పనులు ప్రారంభించాలనీ, కొత్తగా ఆమోదితమైన పనులకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని ఆమె సూచించారు.
సమీక్షలో భాగంగా మల్లికార్జున్ నగర్ కాలనీ, చిల్కానగర్ గుట్ట ప్రాంతాల్లో స్టార్మ్ వాటర్ డ్రైన్ పైప్ అవుట్‌లెట్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. అదేవిధంగా ఆదర్శనగర్ మోడల్ గ్రేవ్‌యార్డ్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.చిల్కానగర్ చౌరస్తా వివేకానంద విగ్రహం నుండి కావేరి నగర్ కల్వర్టు వరకు రూ.6 కోట్లు వ్యయంతో నిర్మించనున్న 1000 ఎంఎం డయా స్టార్మ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనుల శంకుస్థాపనకు సంబంధిత ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు.పలు బస్తీల్లో సిసి రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ కోసం నూతన ప్రతిపాదనలు ఆలస్యం చేయకుండా పూర్తి చేసి పంపించాల్సిందిగా సూచించారు. మల్లికార్జున్ నగర్ కాలనీలో నాచారం చెరువు నుండి వచ్చే ఓవర్ ఫ్లోర్ వాటర్ ట్రంక్ లైన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.డివిజన్లో మిగిలిన ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆటపరికరాల ఏర్పాటు కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రస్తుతం జరుగుతున్న సివిల్ వర్క్స్, సిసి రోడ్ల నిర్మాణ పనులను అధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆమెతెలిపారు.సమీక్ష సమావేశంలో డీఈ వెనెల్ గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం