టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
2025లో సమర్థవంతమైన చట్ట అమలు, నేర నియంత్రణలో గణనీయమైన పురోగతి
రాచకొండ, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
2025 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యం లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ విడుదల చేసిన వార్షిక నివేదిక, ఆధునిక సాంకేతికతతో కూడిన సిటిజన్–ఫస్ట్ పోలీసింగ్‌లో రాచకొండను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపింది. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, ఈ నివేదిక ప్రజల విశ్వాసం, నేర నియంత్రణ, సమాజ భాగస్వామ్యంతో కూడిన పోలీసింగ్‌ను ప్రతిబింబిస్తోంది.5,122 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 64 లక్షల జనాభాకు సేవలందిస్తున్న రాచకొండ కమిషనరేట్, పట్టణ–సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన మరియు మానవీయ పోలీసింగ్ సాధ్యమని నిరూపించింది. విజిబుల్ ప్రెజెన్స్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీ ఆధారిత చర్యలతో కూడిన విక్యుటి పోలీసింగ్ సూత్రం ఈ ఏడాది కీలక మార్గదర్శకంగా నిలిచింది.ఈ ఏడాది మొత్తం 33,040 కేసులు నమోదు కాగా, 25,643 కేసులు పరిష్కారమై 78 శాతం పరిష్కార రేటు నమోదుైంది. 4,121 నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలుతో జీరో–ఎన్ బి డబ్ల్యూ హోదా సాధించారు. కోర్టులలో 31 జీవిత ఖైదులతో సహా మొత్తం 144 శిక్షలు పడగా, ఒకే హత్య కేసులో 17 జీవిత ఖైదులు పడటం ప్రత్యేకంగా నిలిచింది.నేర నివారణలో భాగంగా ఆస్తి నేరాలు దాదాపు 15 శాతం తగ్గాయి. సైకిల్ గస్తీ, కార్ దళాల మోహరింపుతో దృశ్య పోలీసింగ్ ఫలితాలు ఇచ్చింది. ఎన్‌డిపిఎస్ కేసుల్లో రూ. 20.01 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా, అవయవ అక్రమ వాణిజ్య నెట్‌వర్క్‌లను ఛేదించి 16 మంది శిశువులను రక్షించారు.సామాజిక బాధ్యతలో భాగంగా గోల్డెన్ కేర్ (సీనియర్ సిటిజన్లు), బరోసా సెంటర్ (బాధితుల కౌన్సెలింగ్), రౌడీషీటర్లతో సంస్కరణాత్మక కార్యక్రమాలు అమలు చేశారు. మెగా జాబ్ ఫెయిర్ ద్వారా 2,323 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.భవిష్యత్తు లో అధునాతన అనలిటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, స్మార్ట్ ఫీల్డ్ ఆపరేషన్‌ల ద్వారా నేరాల అంచనా, వేగవంతమైన న్యాయం, పారదర్శకతను మరింత పెంచే దిశగా రాచకొండ ముందడుగు వేస్తోంది.నమోదైన కేసుల సంఖ్యకన్నా రక్షించబడిన జీవితాలు, పునరుద్ధరించిన విశ్వాసమే విజయ ప్రమాణం అన్న సందేశాన్ని ఈ నివేదిక బలంగా నొక్కి చెబుతోంది.


Comments