ప్రజల విశ్వాసంతో రెండోసారి గెలిచిన ఏకలవ్య ముద్దుబిడ్డ భార్గవి వెంకటేష్

ప్రజల విశ్వాసంతో రెండోసారి గెలిచిన ఏకలవ్య ముద్దుబిడ్డ భార్గవి వెంకటేష్

అడ్డాకల్,డిసెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకలవ్య ముద్దుబిడ్డ మంగరాయి భార్గవి వెంకటేష్‌పై గ్రామ ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి రెండోసారి వార్డు సభ్యురాలిగా ఎన్నుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ విజయం దక్కిందని ఆమె తెలిపారు.బలీదుపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలు 17-12-2025న జరగగా, సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 1034 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కరుణాకర్ రెడ్డి 647 ఓట్లు సాధించి 431 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.ఇతర అభ్యర్థులుగా పెద్దమందడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేణు 216 ఓట్లు, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి 147 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి 14 ఓట్లు పొందారు.గ్రామపంచాయతీకి మొత్తం 10 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 8 వార్డులను కైవసం చేసుకోగా, బీఆర్‌ఎస్ ప్యానల్ రెండు వార్డుల్లో విజయం సాధించింది.
2013 సర్పంచ్ ఎన్నికలతో పాటు 2025లో కూడా భార్గవి వెంకటేష్ రెండోసారి వార్డు సభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వార్డు ప్రజలకు, గ్రామ ప్రజలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి సహాయపడతానని, భూ సమస్యలు, పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సమస్యలు సహా అన్ని సందర్భాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం