ఖమ్మం త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&అర్డర్

ఖమ్మం త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&అర్డర్

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు. సోమవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అడిషనల్ డీసీపీ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు,. సీసీటీఎంఎస్ అప్లోడ్, జనరల్‌ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు. పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, సస్పెక్ట్ షీట్‌లు, పెండింగ్‌ కేసులు పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు.  స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వివిధ కేసుల్లోని వాహనాలను పరిశీంచారు.IMG-20251222-WA0151

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .