కీసరలో అంబేద్కర్ 200వ జ్ఞానమాల కార్యక్రమం
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తోటకూర వజ్రెష్ యాదవ్
కీసర, డిసెంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు)
కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 200వ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన“అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాదు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన ఘన నివాళి” అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను అవగాహన చేసుకొని విద్య, సామాజిక చైతన్యం, హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో దమ్మైయిగూడ మున్సిపల్ అధ్యక్షులు ముప్పు రామారావు, కీసర మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి విజయ్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ బక్కని నర్సింగ్‌రావు, మాజీ ప్రజాప్రతినిధులు, కీసర మండల అంబేద్కర్ సంఘపదవిదారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments