గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)
గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా పనిచేస్తూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఆయన సూచించారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంతో పాటు కూసుమంచి మండలంలోని కూసుమంచి, జీళ్లచెరువు, ధర్మ తండా, గొరీలపాడు తండా, గంగబండ తండా గ్రామాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను అభినందించి, శాలువాలు కప్పి సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఎల్లప్పుడూ నిబద్ధతగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments