లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం....
జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి వెంపటి అపర్ణ
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ -21(తెలంగాణ ముచ్చట్లు)
లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం దొరుకుతుందని జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి అపర్ణ తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం ఆదివారం న్యాయ సేవా సదన్ లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంపటి అపర్ణ మాట్లాడుతూ రాజీ పడదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద బీమా కేసులను అధిక సంఖ్యలో లోక్ అదాలత్ నందు పరిష్కరించడం జరిగిందని అన్నారు. న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించడం జరిగిందని, లోక్ అదాలత్ తో రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులకు విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.
కక్షిదారులు రాజీ పడడం ద్వారా ఇరు పక్షాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. ఇరుపక్షాలు గెలవడం ద్వారా ఇద్దరి మధ్య మంచి వాతావరణం నెలకొంటుందన్నారు. ఖమ్మం అడ్వకేట్ల సంఘం అధ్యక్షులు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లోక్ ఆదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్ సహకరించిన భీమా కంపెనీలు, పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన ఓ రోడ్డు ప్రమాద కేసులో బాధితుడు తేళ్ల నరేంద్ర సాయి యాక్సిడెంట్ వల్ల చేయి కోల్పోవడంతో శాశ్వత అంగవైకల్యం ఏర్పడడంతో పరిహారం కోసం జిల్లా కోర్టులో కేసు దాఖలు చేయడంతో పిటిషనర్ న్యాయవాది, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాది హరేందర్ రెడ్డి తో మాట్లాడి కేసు రాజీ చేయగా బాధితునికి నష్ట పరిహారంగా 39 లక్షల 50 వేలు ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించడంతో లోకదాలత్ అవార్డు బహుకరించి పూల మొక్క బహుకరించారు. మరో రోడ్డు ప్రమాద కేసులో బాధితునికి 8 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించడంతో న్యాయవాది బండారుపల్లి గంగాధర్, పిటిషనర్ న్యాయవాది దొబ్బల సురేష్ సమక్షంలో న్యాయమూర్తి అవార్డు బహుకరించారు. ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి గోడిసెల అఖిల 81 కేసు పరిష్కరించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కక్షిదారులకు భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాం ప్రసాదరావు, సీనయ్య, మురళీమోహన్, శివరంజని, దీప, రజిని, 
బిందుప్రియ, మాధవి, అఖిల, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, ఇన్సూరెన్స్ ప్రతినిధులు, పోలీస్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.


Comments