గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తా
పెద్దమందడి,డిసెంబర్08(తెలంగాణ ముచ్చట్లు):
గత 40 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ ఆపద వచ్చిన తక్షణమే స్పందిస్తూన్న నేను మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని ఒక్కసారి గ్రామ సర్పంచ్ గా ఉంగరం గుర్తు పై ఓటు వేసి గెలిపించినట్లయితే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అమ్మపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గౌని మాధవి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.సోమవారం ఆమె అమ్మాపల్లి గ్రామ ఇంటింటి ప్రచారం అనంతరం అమ్మపల్లి తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాలతో గ్రామ పెద్దల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుననీ వారు తెలిపారు. గ్రామంలో అర్ధర్రాత్రి ఏ ఆపతి వచ్చిన ఏ ఆలోచన చేయకుండా మీ కష్టాలను మా కష్టాలుగా భావించి భారం మోస్తూ ఎల్లవేళల అండగా ఉంటానని అన్నారు.గతంలో స్థానిక సంస్థ ఎన్నికలైన ఎంపీటీసీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో 12 ఓట్ల మెజారిటీతో ఓటమి పాలుకావడం జరిగింది.ఈసారి రిజర్వేషన్ కలిసిరావడంతో నేడు సర్పంచ్ అభ్యర్థిగా గౌని మాధవి వెంకటేశ్వర్ రెడ్డి ఉంగరం గుర్తు బరిలో వున్ననని తెలిపారు.ఈ ఒక్క సారి ఈ నెల 11న జరుగు సర్పంచ్ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు పై వేసి గెలిపించి ఆశీర్వదిస్తారని ప్రజలను కోరారు.గ్రామ ప్రజలందరూ మీరు గెలిపిస్తే సొంత బిడ్డల చూసుకుంటానని హామీ ఇస్తానని అన్నారు.


Comments