పీచర సమ్మక్క–సారలమ్మ దేవస్థానం వద్ద నీటి సౌకర్యాల కోసం భక్తుల డిమాండ్
Views: 8
On
వేలేరు, 27 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ దేవస్థానంలో కనీస నీటి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు బోర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం దేవస్థానంలో భక్తుల కోసం తాగునీరు అందుబాటులో లేదు. చేతిపంపు లేకపోవడంతో పాటు మోటార్లను రక్షణకై తాత్కాలికంగా తీసి భద్రపరిచినట్టు దేవస్థాన కమిటీ చైర్మన్ కొయ్యడ మహేందర్ తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం కనీసం ఒక బోరుబావికి వెంటనే చేతిపంపు ఏర్పాటు చేయాలని, నీటి సదుపాయం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments