ఉప్పల్ లో సీనియర్ సిటిజన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ఉప్పల్, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదివారం రాత్రి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్‌తో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వృద్ధులకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై వారి సూచనలు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను సకాలంలోనే పరిష్కరిస్తామని పరమేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్, షేర్ నరసింహ రెడ్డి, నారాయణ గౌడ్, పాపి రెడ్డి, మోరే అంజి రెడ్డి, మందముల అంజి రెడ్డి, వీరేశం గుప్తా, లింగా రెడ్డి, సి.హెచ్. పురుషోత్తం రెడ్డి, వెంకటేశం, పి. జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments