వెల్టూర్ గ్రామ సర్పంచ్‌గా అశోక్ (చిట్టి) ప్రమాణ స్వీకారం

వెల్టూర్ గ్రామ సర్పంచ్‌గా అశోక్ (చిట్టి) ప్రమాణ స్వీకారం

పెద్దమందడి,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌గా అశోక్ (చిట్టి) గురువారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కూడా తమ పదవులపై ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని నూతన సర్పంచ్ అశోక్‌ను ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వెల్టూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో పనిచేస్తామని ఆయన అన్నారు.
కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20251222-WA0122

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .