మేడ్చల్ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన
అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’’ కార్యక్రమం లో భాగంగా మంగళవారం ఐడీఓసీ సముదాయం ఆవరణలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం, ప్రజా పాలన బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలు ప్రజలకు మరింత సేవ అందించేలా రూపుదిద్దుకున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి,శ్యామ్ ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రత్యేకంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఆలపించిన ప్రజా పాలన, ప్రభుత్వ సంక్షేమం పై పాటలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 


Comments