ఎల్కతుర్తి మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం

ఎల్కతుర్తి మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం

ఎల్కతుర్తి, నవంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు) : 

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యురాలు అంబాల స్వరూప అధ్యక్షత వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు.

రాజుల రాములు మాట్లాడుతూ, వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్యం, విద్యా రంగాల్లో ఇచ్చిన భరోసాలను కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధి హామీ పథకంలో కూలీలకు వాగ్దానం చేసిన 150 రోజుల పని అందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 50 రోజుల పని చేసిన కూలీలకు ₹12,000 ఇవ్వాలనే హామీ కూడా అమలు కాలేదని ఆయన తెలిపారు.

సమావేశంలో జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అంబాల స్వరూప, జిల్లా కమిటీ సభ్యురాలు లోకిని స్వరూప, మండల కమిటీ నాయకులు అన్న రాజ్‌కుమార్, ముద్రకోళ వెంకటేష్, గోళ్ళె రాధ, అంబాల రేణుక, జంగం శ్రీను, జంగం రమేష్, చీకటి లక్ష్మి, అంబాల అశోక్ తదితరులు పాల్గొన్నారుIMG-20251128-WA0032

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .