మంత్రి పొంగులేటికి శుభాకాంక్షల వెల్లువ

మంత్రి పొంగులేటికి శుభాకాంక్షల వెల్లువ


IMG-20260104-WA0129

ఖమ్మం బ్యూరో, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పాలేరు నియోజకవర్గ పర్యటన నిమిత్తం ఆదివారం హెలికాప్టర్‌లో విచ్చేసిన మంత్రికి ఐడీవోసీలోని హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సాదర స్వాగతం పలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడంతో హెలిపాడ్ పరిసరాలు సందడిగా మారాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .