కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపు.
సత్తుపల్లి, జనవరి 5 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 07 (బుధవారం) నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన గ్రామ సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని అదే రోజు ఉదయం 10 గంటలకు ఖమ్మం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కేటీఆర్ పర్యటన పార్టీకి మరింత బలాన్నిచ్చే అంశంగా నిలవనుందని, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను గౌరవించడం ద్వారా పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత పటిష్టమవుతుందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పార్టీ ఐక్యత, క్రమశిక్షణతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు.


Comments