జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు
Views: 8
On
హన్మకొండ,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
క్రిస్మస్ పండగను పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శ్రీను,డిటిఓ శ్రీనివాస్ కుమార్ పాల్గొని సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, మానవత్వం, ప్రేమ, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఈ పండుగ గుర్తుచేస్తుందని వారు పేర్కొన్నారు. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ ఈజీఎస్ సెర్ప్, సూపరిండెంట్లు, డీపీఎంలు, ఏపీఎంలు తదితర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Jan 2026 20:16:04
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు):
మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...


Comments