సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

కాప్రా, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్రా డివిజన్ పరిధిలోని ఎంపీయూపీఎస్ కాప్రా హెచ్‌డబ్ల్యూ పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రీబాయి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె చూపిన మార్గాన్ని నేటి ఉపాధ్యాయులు అనుసరించి విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు విద్యతో పాటు విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలరాజు, రాఘవేందర్ గౌడ్, వేణుమాధవ్ , విద్యార్థులు పాల్గొని సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు మంజుల, రమ, సాయి లక్ష్మీని శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మహిళా విద్య ప్రాముఖ్యతను మరింత పెంపొందించేలా విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .