హరి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మల్లాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ భవానీ నగర్ కాలనీ నివాసి హరి కుటుంబానికి గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అండగా నిలిచారు.మల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల సమాచారం తో ఆదివారం హరి కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించిన నెమలి అనిల్ కుమార్, రూ.10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి అందుబాటు లో ఉన్న సంక్షేమ పథకాలు హరి కుటుంబానికి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్అక్బర్, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాస్, సీనియర్ నాయకులు కోయలకొండ రాజేష్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు బాతరాజు రాహుల్, యాసీన్ తదితరులు పాల్గొన్నారు. 


Comments