మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం

అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు):

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా  అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సరిత, మండల స్థాయి ప్రాజెక్టు మేనేజర్ మహేష్ నాయకత్వం వహించారు.ఈ సమావేశంలో బలీదుపల్లి గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు మంగరాయి భార్గవి, అడ్డకుల శ్రీలక్ష్మీ గ్రామ మహిళా సంఘం కార్యదర్శి సంధ్య నూతనంగా వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు.జిల్లా స్థాయి ప్రాజెక్టు మేనేజర్లు లక్ష్మయ్య, రామ్మూర్తి, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సరిత, మండల ప్రాజెక్టు మేనేజర్ మహేష్ ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రజలు నమ్మకంతో గెలిపించిన బాధ్యతను గుర్తించి సమాజ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని హాజరైన నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ప్రాజెక్టు మేనేజర్లు లక్ష్మయ్య, రామ్మూర్తి, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సరిత, మండల ప్రాజెక్టు మేనేజర్ మహేష్, మండల సమన్వయకర్తలు రాజు, సురేష్, యాదగిరి, ప్రమీలరాణి, వివిధ గ్రామాల సంఘ నిర్వహకులు శ్రీధర్ యాదవ్, నసీరుద్దీన్, యాదమ్మ, స్వప్న, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.! ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.!
- పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలి. - సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు. సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక...
పిల్లల భద్రతే లక్ష్యం.. బడి బస్సుల తనిఖీలు.
రేపు గంగారం లో విద్యుత్ వినియోగదారుల సదస్సు.
ఐడిబిఐ బ్యాంకు సహకారంతో తాటికాయల ప్రైమరీ పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభం
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని
బీసీలకు చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్” అమలు చేయాలి
కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం