జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
_సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందిస్తాయి
కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి
కుషాయిగూడ, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
డా. ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమకారురాలు శేరి మణెమ్మ ఆధ్వర్యంలో ఆదివారం రోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పేదలు, నిరుపేదలు, అవసరమైన వారికి దుప్పట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందిస్తాయని అన్నారు.ప్రజల సంక్షేమానికి దోహదపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్సై వెంకన్న, జవహర్ నగర్ ఎస్సై మౌనిక కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శేరి మణెమ్మ మాట్లాడుతూ, పేదల సంక్షేమం, ప్రజల సేవే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ఐక్యతతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమ కాలంలో శేరి మణెమ్మ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాల్లో ముందుండి పోరాటం చేశారు. ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఉద్యమకారులకు అవసరమైన సహకారం అందిస్తూ ఉద్యమానికి అండగా నిలిచారు. రాష్ట్ర సాధన అనంతరం కూడా ప్రజాసేవే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక ప్రజల మన్ననలు పొందుతున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కందుల లక్ష్మీనారాయణ, పాకాల రాజన్న, యక్కయ్య, ఎస్.ఏ. రహీం, గడ్డం శ్రీనివాస్, రమేష్, నర్సింహా, వెంకట రావు, శ్రీనివాస్, పడాల ఆనంద్, స్వామి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు.


Comments