పులిగుండాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం 

మంత్రి పొంగులేటి

పులిగుండాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)

అడవుల సంరక్షణ, అభివృద్ధిలో వన సంరక్షణ సమితుల (వీఎస్‌ఎస్‌) పాత్ర కీలకమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు మండల పరిషత్తు ఆవరణలో నూతనంగా నిర్మించిన వీఎస్‌ఎస్‌ సమావేశ మందిరాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కనకగిరి, పులిగుండాల అటవీ ప్రాంతం సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు దీటుగా వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అడవులను కాపాడుకుంటూనే, స్థానిక గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా ఎకో-టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వన సంరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం పులిగుండాల విహార యాత్ర కోసం రెండు వాహనాలను ప్రారంభించి, సమితి సభ్యులకు కుటీర పరిశ్రమల యూనిట్లను అందజేశారు.IMG-20251231-WA0141 ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .