భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం

డా. జిల్లెల చిన్నారెడ్డి

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం

వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు):

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని ఎం.వి.ఆర్ ఫంక్షన్ హాల్‌లో రాములు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామన్ ఐఐటి టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రాచీన కాలంలో నదుల పక్కనే నాగరికత ప్రారంభమైందని,నదీ తీర ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ మనిషి నాగరికత వైపు అడుగులు వేశాడని చెప్పారు. నిప్పును కనుగొని వంట చేసుకోవడం నుంచి ఇనుము ద్వారా ఆయుధాల తయారీ వరకు మానవ అభివృద్ధి కొనసాగిందని, నేటి ఆధునిక లగ్జరీ జీవనశైలి మొత్తం సైన్స్ ఫలితమేనని పేర్కొన్నారు.ఆదిమానవుని నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు జరిగిన అభివృద్ధి అంతా శాస్త్ర విజ్ఞానమేనని తెలిపారు.విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని, విద్యను నిర్లక్ష్యం చేయకుండా ఆకాశమే హద్దుగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పుట్టిన నేలకు సేవ చేయాలన్న భావన విద్యార్థుల్లో పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థులు ముందుగా తల్లిదండ్రులను, ఆ తర్వాత గురువులను గౌరవించాలని, తల్లిదండ్రులు పిల్లలకు పురాణాలు,సంస్కృతి గ్రంథాలు ఎక్కువగా చదివించాలని సూచించారు.భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ విద్య మరింత బలపడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్,వనపర్తి జిల్లా కళా మండలి అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్,ప్రజా వైద్యులు మురళీధర్,మాజీ జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, నాగరాజు, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం వినోద్,సీనియర్ నాయకులు జానంపేట నాగరాజు, కోళ్ల వెంకటేష్, ఎంట్ల రవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.IMG-20260104-WA0155

Tags:

Post Your Comments

Comments

Latest News

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు): మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా  అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...
బీసీ భవన నిర్మాణానికి అనుమతి.!
గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.
కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం