మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు

మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు

నేరేడుమెంట్, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)

మున్నూరు కాపులు ఐక్యతతో ఉండి కలిసికట్టుగా పనిచేస్తేనే సంఘ అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు సర్దార్ పుట్ట పురుషోత్తం రావు అన్నారు. నేరేడుమెట్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మధుసూదన్ పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘ బలోపేతానికి ప్రతి సభ్యుడు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపు సంఘం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్ పాల్గొని సంఘం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. సంఘ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.గౌరవ అధ్యక్షులు, మాజీ ములుగు జడ్పిటిసి సింగం సత్తయ్య పటేల్ మాట్లాడుతూ, సంఘ అభివృద్ధికి ఐక్యతే ప్రధానమని అన్నారు. యువత సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రచార కార్యదర్శి సింగం రాజు పటేల్, సింగం నరసింహ పటేల్, తోట అంజయ్య, అప్పల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి కోల నాగేష్, వెంకటేష్, తోట రాములు పటేల్, కనకరాజు పటేల్, శ్రీపాల్ పటేల్, బాలయ్య పటేల్, శ్రీకాంత్ పటేల్, కనకయ్య పటేల్, సురేష్ పటేల్, పండు పటేల్, సుధాకర్ పటేల్, మురళి పటేల్, ఉపేందర్ పటేల్, కరుణాకర్ పటేల్, సిదయ్య పటేల్, స్వామి పటేల్ తదితరులు పాల్గొన్నారు.పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు హాజరై క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.IMG-20260104-WA0139

Tags:

Post Your Comments

Comments

Latest News

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు): మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా  అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...
బీసీ భవన నిర్మాణానికి అనుమతి.!
గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.
కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం