కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం
కుషాయిగూడ, జనవరి 02 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ జి. మధు మాట్లాడుతూ, ప్రజా రవాణాలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన సేవలు అందిస్తోందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా శూన్యంగా (0) మారాలని ఆకాంక్షించారు.డ్రైవింగ్ సమయంలో పూర్తి శ్రద్ధ, బాధ్యతతో వాహనం నడిపితే ప్రమాద రహిత డ్రైవర్లుగా గుర్తింపు పొందుతారని సూచించారు. బస్సులను తప్పనిసరిగా బస్‌బేలోనే నిలపాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే ప్రయత్నాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ట్రాఫిక్ ఏఎస్ఐ నర్సింలు మాట్లాడుతూ, మనం మరియు మన కుటుంబ సభ్యులు సురక్షితంగా రోడ్లపై ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరూ తమ విధులను కర్తవ్యదిక్షతో నిర్వర్తించాలని అన్నారు.డిపో మేనేజర్ మాట్లాడుతూ, మానవ తప్పిదాల వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎదురుగా వచ్చే వాహనాలను గమనిస్తూ రక్షణాత్మక (సేఫ్) డ్రైవింగ్ పాటించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వేగ నియంత్రణ పాటిస్తూ, మద్యపానం లేకుండా వాహనం నడపడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నర్సింలు, ఎస్ఐ జి. మధు, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) వ్యాసు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఈ. జనా
ర్ధన్, బి. ఎలంధర్ రెడ్డి, కండక్టర్లు, డ్రైవర్లు మరియు పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.


Comments