సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

కాప్రా, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు) 

ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్‌ బి కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో రోడ్ నెంబర్–5 వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీ ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ చారి, శ్రీనివాస్‌తో పాటు కాలనీ అధ్యక్షులు మల్లారెడ్డి, దేవ్‌రాజ్, అంజయ్య గౌడ్, చారి, బాలయ్య గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కిష్టారెడ్డి, శ్రీనివాసులు, మాస్ల మణి, గణేష్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .