స్మార్ట్ కిడ్జ్ లో ఆనంద ఉత్సవాలతో న్యూ ఇయర్ వేడుకలు.
స్మార్ట్ కిడ్జ్ క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య
ఖమ్మం బ్యూరో,డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబురాలు అంబరాన్నంటాయి. పాఠశాల చిన్నారులు కొత్త ఏడాదికి సుస్వాగతం పలుకుతూ, నృత్యాలు చేస్తూ ఘనంగా వేడుకలు జరిపారు. తొలుత పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య న్యూ ఇయర్ కేక్ ని కట్ చేసి చిన్నారులకు తినిపించారు. విద్యార్థులు తమ మిత్రులకు మిఠాయిలు పంచుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కేరింతలు కొడుతూ, స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. అనంతరం స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ లను పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. విద్యార్థుల ఫోటోలతో, పాఠశాల కార్యక్రమాలతో కూడిన ఈ క్యాలెండర్ ప్రత్యేకతను సంతరించుకోగా క్యాలెండర్ ను, గ్రీటింగ్ కార్డులను విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ శుభాలు అందించాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థులు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరారు. చదువుల్లోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లోనూ నూతన సంవత్సరంలో ఘనవిజయాలు సాధించి పాఠశాలకి,జిల్లాకి ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య ,ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments