హనుమాన్ నగర్‌లో త్వరలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

హనుమాన్ నగర్‌లో త్వరలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

నాచారం, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ హనుమాన్ నగర్‌లో భూగర్భ డ్రైనేజీ సమస్యలతో బస్తీవాసులు చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు స్థానికులు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌ను విన్నవించుకున్నారు.దీనిపై స్పందించిన కార్పొరేటర్ ప్రత్యేక చొరవతో, ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ద్వారా ఏప్రిల్ నెలలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.25 లక్షల నిధులను మంజూరు చేయించారు. టెండర్ ప్రక్రియ పూర్తై, పైపులు తెప్పించే వరకు కొంత ఆలస్యం జరిగినప్పటికీ, పనులు త్వరగా ప్రారంభించేందుకు కార్పొరేటర్ కృషి ఫలించింది.డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన సందర్భంగా బస్తీవాసులు కార్పొరేటర్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నుంచి మూడు రోజుల్లో డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ పనులు పూర్తయ్యాక వెంటనే సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, సుజాత, రవి, మనోజ్, మల్లేష్, సుమిత్ర, నీలమ్మ, విజయ, దిలీప్, నజీర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .