సీసీ రోడ్డు పనులను పరిశీలించిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్
చిల్కానగర్, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)
చిల్కానగర్ డివిజన్ పరిధిలోని బీరప్ప గడ్డ ప్రాంతంలో సుమారు 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ స్థానిక బస్తీ వాసులతో కలిసి పర్యవేక్షించారు.సీసీ రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ ఆలస్యంగా చేపడుతున్నాడని బస్తీ వాసులు చేసిన విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ బస్తీ పర్యటన నిర్వహించి, నిర్మాణ స్థలం నుండే కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పనుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, బస్తీ వాసులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.సంక్రాంతి పండుగ లోపు నూతన రోడ్లపై ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే విధంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అలాగే జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ కు కూడా కాంట్రాక్టర్ ద్వారా పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని కోరారు.
అదేవిధంగా బీరప్ప గడ్డ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధుల్లో చేపడుతున్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులపై కూడా కాంట్రాక్టర్‌తో మాట్లాడి, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. డ్రైనేజీ అనంతరం సీసీ రోడ్డు పనులు కూడా వెంటనే చేపట్టి పూర్తి చేస్తానని, తద్వారా బస్తీ వాసులు సంక్రాంతి పండుగను
ఆనందంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీరప్ప గడ్డ బస్తీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments