ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం ను కలిసిన దయ్యాల దాసు
వనపర్తి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర కార్మిక విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దయ్యాల దాసు ఆధ్వర్యంలో మంగళవారం దళిత నాయకులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులు చేసిన రుణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని దయ్యాల దాసు కోరారు.దీనిపై స్పందించిన చైర్మన్ నగరి ప్రీతం ఇదివరకే రూ.2,000 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా రుణాలు అందించే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.రాజీవ్ యువ వికాసం పథకంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా లోన్లు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారని దయ్యాల దాసు తెలిపారు..ఈ కార్యక్రమంలో గద్దల ప్రభాకర్, నిరంజన్, కృష్ణ, దయ్యాల అంజన్న, గుండెల చంద్రమోహన్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.


Comments