అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

ఆరోగ్య లక్ష్మి కమిటీ ఏర్పాటు

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

వనపర్తి,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని 3వ  అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీని ఏర్పాటు చేసి, కేంద్ర నిర్వహణ, పిల్లల హాజరు,పోషకాహార పంపిణీ వ్యవస్థపై సమగ్రంగా పరిశీలించారు.అంగన్వాడి కేంద్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందా అనే అంశాలపై సర్పంచ్ ఆరా తీశారు. అలాగే పోషకాహారం సరఫరా విధానం, నాణ్యత,నిర్వహణపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు గర్భిణీ స్త్రీలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు ప్రతి నెల ప్రభుత్వం ద్వారా అందే పాలు, గుడ్లు, బాలామృతాన్ని సకాలంలో తీసుకొని, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సర్పంచ్ సూచించారు.పిల్లల ఆరోగ్యం, పోషణ గ్రామ అభివృద్ధికి పునాదని పేర్కొన్న సర్పంచ్, అంగన్వాడి కేంద్రాల పనితీరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారుIMG-20260105-WA0055ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణేష్ నాయకులు,ఎస్.రాములు,పోతుల రామిరెడ్డి,రామకృష్ణారెడ్డి, శ్రీ బోయిన కృష్ణ,బాలాజీ,ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.! ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.!
- పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలి. - సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు. సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక...
పిల్లల భద్రతే లక్ష్యం.. బడి బస్సుల తనిఖీలు.
రేపు గంగారం లో విద్యుత్ వినియోగదారుల సదస్సు.
ఐడిబిఐ బ్యాంకు సహకారంతో తాటికాయల ప్రైమరీ పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభం
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని
బీసీలకు చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్” అమలు చేయాలి
కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం