మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి , జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు) జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 195వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అధికారులు పూలమా లలు వేసి నివాళులర్పించారు.బాలికల విద్య, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమంలో జిల్లాలోని 13 మంది మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, జిల్లా జీసీడీఓతో పాటు జిల్లాస్థాయి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.వక్తలు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం చేసిన పోరాటం నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆమె ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. 


Comments