నూతన సంవత్సరంలో లక్ష్యాలను ఏర్పరచు కుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరం–2026 సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. కొత్త ఏడాదిలో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, మంచి ఆశయాలతో జీవితం సాగించాలని తెలిపారు.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేయస్సుతో పాటు ఆనందాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.అలాగే ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అభిలషిస్తూ, 2026 నూతన సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి శుభాకాంక్షలు తెలిపారు.


Comments