సావిత్రి భాయి ఫూలే జయంతి స్ఫూర్తితో సమానత్వ సమాజ స్థాపనకు పోరాడుదా.
జ్యోతిరావు ఫూలే, సావిత్రి భాయ్ ఫూలే త్యాగాలకు నిదర్శనంగా వాళ్ళ పేరుతో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.
జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ.
ఖమ్మం బ్యూరో, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు)
భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రం లో రెండు కేంద్రాల్లో ఎస్&బిజినార్ మరియు మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రి భాయ్ ఫూలే గారికి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన నివాళి సభలో ఎస్ ఆర్ అండ్ బిజినార్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్,జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సురేష్ ( ఎమ్మెస్),ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బానోత్ రెడ్డి, జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, జార్జిరెడ్డి పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా గర్ల్స్ కన్వీనర్ పైండ్ల శ్యామల కో కన్వీనర్ మహంకాళి రాణి లు
మాట్లాడుతూ భారతావని చరిత్రలో సావిత్రి భాయి ఫూలే దంపతుల పోరాటం అజరామరం అని అన్నారు. అన్ని వర్గాలకు విద్యా అందించడానికి వారు నాటి ఆధిపత్య సమాజం పై అక్షర యుద్ధం చేసారని తెలిపారు. తనపై భౌతిక, మానసిక దాడికి చేసిన నాటి
అగ్ర వర్గాలకు సైతం ఆశ్రయం కల్పించారని, వారి బిడ్డలకు సైతం తన ఆశ్రమం లో వసతి కల్పించి, సపర్యలు చేసి మానవత్వానికి చిరునామా నిలిచారని కొనియాడారు. మహిళల పట్ల పెనవేసుకున్న పురుష ఆధిపత్య భావజాలాన్ని విసర్జించి, మనుషులందరూ సమానమేనే భావాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి నేటి తరం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, విద్యా ,ఉద్యోగ, సాంస్కృతిక తదితర రంగాలలో తగిన ప్రాధినిద్యం కల్పించడానికి పాలకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సావిత్రి భాయి ఫూలే దంపతుల పోరాట స్పూర్తితో సమానత్వ సమాజ స్థాపన లక్ష్యంతో పోరు బాట పట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా నాయకులు కృష్ణవేణి, రాము, ప్రవళిక, సమీరా, లక్ష్మీ ప్రసన్న, వేణు, రమేష్, సంధ్య, హెచ్చి,తదితరులు నాయకత్వం వహించారు.


Comments