బండారి లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన చిల్కానగర్ డివిజన్ పాస్టర్లు
చిల్కానగర్, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ పరిధిలోని వివిధ చర్చిల పాస్టర్లు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజు, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాస్టర్లు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజులపై ఆ ఏసుప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.అదనంగా, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాస్టర్లకు నూతన దుస్తులు, క్రిస్మస్ గిఫ్టులు ఎంతో దయా హృదయంతో పంపిణీ చేస్తున్నందుకు గాను పాస్టర్లు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ ఏసుప్రభు ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ పాస్టర్లు గోనె ఫిలిప్స్, జెరూసలెం మత్తయ్య, మనోహర్, జాకోబ్ రాజు, నటానియల్, ఇమాన్యుల్, తేజు మై తదితరులు పాల్గొన్నారు.


Comments