డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కుషాయిగూడ కాలనీవాసులు
కుషాయిగూడ, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలకు బస్ సౌకర్యం కల్పించినందుకు కుషాయిగూడ బస్ డిపో మేనేజర్ వేణుగోపాల్, ఓఎస్ నర్సింహా రెడ్డికి శనివారం కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.శుభోదయ కాలనీ ఫేస్–1, 2, 3, సోనియా గాంధీ నగర్ కాలనీ ఫేస్–1, 2, 3, వాసవి శివనగర్ కాలనీ, మీనాక్షి నగర్, న్యూ వాసవి శివనగర్, ఎంఆర్‌ఆర్ కాలనీ, ద్వారకాపురి కాలనీ, మధురనగర్, మోడీ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, వైష్ణవి ఎన్‌క్లేవ్, మారుతి ఎన్‌క్లేవ్, లక్ష్మీ నర్సింహా కాలనీల వాసులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బస్ సౌకర్యం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ, బస్ సౌకర్యం వల్ల కాలనీవాసుల ప్రయాణ సమస్యలు తీరాయని, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ మీనాక్షి నగర్ కాలనీ అధ్యక్షులు సురేష్ గుప్త, నర్సింగ్ రావు, శుభోదయ కాలనీ మాజీ అధ్యక్షులు కాసుల నందం గౌడ్,
లక్ష్మీ నర్సింహా కాలనీ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి, గోకుల్ దాస్. ఎస్. సత్యం యాదవ్, నీరుడు బాబు, ఎన్. రమేష్, జగన్ పంతులు, సంజీవ్ యాదవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments