సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలి.

అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన.

సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలి.

సత్తుపల్లి, జనవరి 3 (తెలంగాణ ముచ్చట్లు):

సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు సిపిఎం పట్టణ, రూరల్ కమిటీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మధిర, ఖమ్మం నగరాల్లో అర్ధరాత్రి నుంచే సిపిఎం జిల్లా, డివిజన్ స్థాయి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మధిర పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు పోలీసు శాఖ నుండి అనుమతి తీసుకున్నప్పటికీ ర్యాలీ జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందినిలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఎం మంచి ఫలితాలు సాధించడంతో అనేక గ్రామాల్లో దాడులకు పాల్పడుతూ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. దీనికి నిరసనగా చేపట్టిన శాంతియుత ర్యాలీలను విచ్ఛిన్నం చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. సిపిఎం పార్టీగా ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, సిపిఎం నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, మల్లూరి చంద్రశేఖర్, వలి, అర్జున్, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే మహిళా సంఘం నాయకులు తన్నీరు కృష్ణవేణి, శీలం కరుణ, సత్తుపల్లి సిపిఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, పుష్పవల్లి, నాగమణి, రజిని, లక్ష్మణ్, సనందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం