రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం.!

రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం.!

- సత్తుపల్లి డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం.

- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్‌ఐ ప్రదీప్.

సత్తుపల్లి, జనవరి 1 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి వాహనదారుడు పూర్తి ఏకాగ్రతతో వాహనం నడుపుతూ రోడ్డు నియమాలను విధిగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సత్తుపల్లి ఎస్‌ఐ ప్రదీప్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి వాహనదారుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రత్యేకించి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు మరింత అప్రమత్తతతో, ఏకాగ్రతతో వాహనాలు నడిపితే ప్రమాదాల అవకాశాలు చాలా మేర తగ్గుతాయని పేర్కొన్నారు. రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా డ్రైవర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత మాట్లాడుతూ, ప్రతి డ్రైవరు సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకుని శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. “భద్రంగా డ్రైవ్ చేయండి – సురక్షితంగా ఉండండి” అనే సందేశాన్ని ఆమె డ్రైవర్లకు ఇచ్చారు. కుడి వైపు నుంచే వాహనాలను దాటాలని, మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని ఆమె హెచ్చరించారు. ఎదురుగా వచ్చే వాహనాలను జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా వాహనం నడపాలని సూచించారు. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, పూర్తి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని ఆమె కోరారు.IMG-20260101-WA0109
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సైదిరెడ్డి, ఏడీసీలు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం