మోజర్ల గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ–ఆరోగ్య విద్యా దినోత్సవం
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మోజర్లసర్పంచ్ చంద్రశేఖర్
పెద్దమందడి,జనవరి2(తెలంగాణ ముచ్చట్లు):
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో శుక్రవారం 1,2వ అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి సుధారాణి హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, సరైన పోషణతో పాటు ఆరోగ్య విద్య అందిస్తూ చిన్నారులకు ఫిజికల్ యాక్టివిటీస్, ఆటల పోటీలు నిర్వహించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.అనంతరం అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, వనపర్తి ప్రాజెక్ట్ సిడిపిఓహజీరాబేగం, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగరాణి, అంగన్వాడీ టీచర్లు శారద, సువర్ణ, ఆశా కార్యకర్తలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments