అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
సిపిఐ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్ కె నారాయణ
ఖమ్మం బ్యూరో, జనవరి 04(తెలంగాణ ముచ్చట్లు)
అభివృద్ధే శ్వాసగా వనిచేస్తే..ప్రజలే తరతరాలు ఆదరిస్తారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్ కె నారాయణ పేర్కొన్నారు. ఆదివారం చింతకాని మండలం నేరడ గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీ అభినందన సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో నారాయణ మాట్లాడుతూ నేతాజీ చిన్నతనం నుంచి సామాజిక అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి అని జర్నలిస్టుగా ఈ గ్రామ సమస్యలు తనకు తెలుసునని ఈ ప్రాంత అభివృధ్ది కోసం ఎంతో కృషి చేస్తాడని అన్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని రాజకీయలకతీతంగా అభివృద్ధి చేసి ప్రజలతో మమేకం అవ్వాలని నూతన పాలకమండలికి నూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నేతాజీ నేరడ అభివృద్దిలో అగ్రగామిగా నిలుపుతాడని పేర్కొన్నారు. అంతకుముందు నేతాజీయువజన సంఘం ఆధ్వర్యంలో 50కేజీల కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు, నూతన సర్పంచ్లు నేతాజీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి నురేష్, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ నభ్యులు తాటి వెంకటేశ్వర్లు, ఏవూరి రవీంద్రబాబు, రామాంజనేయులు, కూచివుడి రవి, పావులూరి మల్లిఖార్జునరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాసాల మోహన్ రావు, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు సహాయ కార్యదర్శి అబ్బూరి మహేష్, సీనియర్ నాయకులు దూసరి శ్రీరాములు ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
అంబటి వెంకటేశ్వర్లు, టిడిపి మండల అధ్యక్షుడు తేలు కుంట్ల శ్రీనివాసరావు, నూతన సర్పంచ్ లు , సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments