ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.
దమ్మపేట, జనవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామంలో కుంజా దావీదు–పార్వతి దంపతుల కుమార్తె తేజశ్రీ, కుమారుడు ప్రణయ్‌కుమార్‌ల ఓణీల మరియు పంచకట్టు వేడుకలు బంధుమిత్రుల మధ్య ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పాల్గొని, దమ్మపేట మండలం మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావుతో కలిసి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు మంచి సంస్కారాలు, ఉత్తమ విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకురాలు వగ్గేల పూజ, పార్కెలగండి గ్రామ సర్పంచ్ కొమరం సుశీల, బిఆర్ఎస్ యువజన నాయకులు కాకా శివశంకర్ ప్రసాద్, పద్దం అశోక్‌తో పాటు గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments