రేపు గంగారం లో విద్యుత్ వినియోగదారుల సదస్సు.
గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. - ఏ.డి.ఈ ప్రసాద్ బాబు.
సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
గంగారం గ్రామంలో రేపు (గురువారం) విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏ.డి.ఈ ప్రసాద్ బాబు మీడియా కు తెలిపారు. గంగారం గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ కార్యాలయంలో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సీజీఆర్‌ఎఫ్–1 చైర్‌పర్సన్ వేణుగోపాల చారి ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారుల కోర్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు వినియోగదారుల ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.
ఈ సదస్సులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, వోల్టేజ్ హెచ్చు–తగ్గుదల, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అభివృద్ధి, లోపాలున్న మీటర్ల మార్పు, నూతన సర్వీసుల మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీసుల పేరు మార్పు, అధిక బిల్లుల సమస్యలు, కేటగిరీ మార్పు, సర్వీస్ రద్దు వంటి సమస్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. ఈ సదస్సు ద్వారా సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ప్రసాద్ బాబు, టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వివరాలకు
చైర్‌పర్సన్ ఎన్.వి. వేణుగోపాల చారి – 8712481313,
మెంబర్ టెక్నికల్ కె. రమేష్ – 8712481314,
మెంబర్ ఫైనాన్స్ ఎన్. దేవేందర్ – 8712481316,
ఇండిపెండెంట్ మెంబర్ ఎం. రామారావు – 8712481485
నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రతి విద్యుత్ వినియోగదారుడు ఈ సదస్సులో పాల్గొని సమస్యలు పరిష్కరించుకొని లబ్ధి పొందాలని ఆయన కోరారు.


Comments