ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
రికార్డు స్థాయిలో రక్తదానం
ఘనంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు
వనపర్తి,జనవరి8(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జన్మదినం సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో రికార్డు స్థాయిలో రక్త సేకరణ జరిగింది.రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, యువశక్తి ఫౌండేషన్ సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరంలో మొత్తం 482 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో కూడా ఎమ్మెల్యే మేఘా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో రక్తదానం జరిగిందని, అదే తరహాలో ఈ ఏడాది కూడా 482 యూనిట్ల రక్త సేకరణ జరగడం హర్షించదగ్గ విషయమని నిర్వాహకులు తెలిపారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి తొలుత ఖిల్లా ఘణపురం మండలం గట్టు కాడిపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో మండల నాయకులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.
అనంతరం ఖిల్లా ఘణపురం మండలం మానాజీపేట గ్రామ స్టేజీ వద్ద గ్రామస్తులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు.
వృద్ధులకు అన్నదానం ప్రారంభం
వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులోని చేయూత అనాథాశ్రమం ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వాహనాన్ని గతంలోనే అనాథాశ్రమానికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ క్రమంలో జన్మదిన సందర్భంగా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అనాథ వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం పామిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మోర్పుష్యకాలు, పెన్నులను పంపిణీ చేశారు.రైతులు, కార్మికులతో వేడుకలు
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు, మార్కెట్ యార్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు
వనపర్తి పట్టణంలోని మరికుంటలో గల బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాల కోసం తన సొంత నిధులతో రూ.2 లక్షల విలువైన డిజిటల్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గిరిజన గురుకుల పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు.అనంతరం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


Comments