వనపర్తి జిల్లా నూతన ఎస్పీ సునీత రెడ్డిని కలిసిన గిరిజన సేవా సంఘం
వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పి సునీత రెడ్డి ని వనపర్తి జిల్లా గిరిజన సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఎం. చంద్రనాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజన తండాల్లో ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తామని సంఘం నాయకులు పేర్కొనగా, ఎస్పీ సునీత రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల భద్రత, సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారు జాతురు నాయక్, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు శంకర్ నాయక్, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ధర్మానాయక్, సర్పంచ్ కిషోర్ నాయక్, సంఘం నాయకులు శివ నాయక్
అంగోత్ రాంజీ నాయక్, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, జానికి రామ్ నాయక్, మోహన్ నాయక్, బంజారా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments