రాజ్‌సుక్‌నగర్‌లో టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం
నాగారం, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
జిహెచ్ఎంసి పరిధిలోని నాగారం డివిజన్ రాజ్‌సుక్‌నగర్ కాలనీలో మదర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ బొజ్జ సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను వినియోగించుకుని కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాగారం డివిజన్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకటరెడ్డి, పంగ హరిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నం రాజ్ సతీష్ గౌడ్, గణపురం కొండల్ రెడ్డి, 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాలరావు పాల్గొన్నారు.అలాగే కాలనీ అధ్యక్షులు దాసు, సంజయ్, బండారి రమేష్, వీరయ్యతో పాటు కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments