ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయకుడు మేఘా రెడ్డి
డి.ఎస్. మహేష్, కాంగ్రెస్ నాయకుడు
పెద్దమందడి,జనవరి8(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు డి.ఎస్. మహేష్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడు మేఘా రెడ్డి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో వనపర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. రైతులు, మహిళలు, యువతకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్ మహేష్, వడ్డె శేఖర్, మల్లికార్జున్, గుండెల ఆంజనేయులు,నాగభూషణ్, వివేక్ , రవీందర్, పాముల రాములు, మహేష్ రెడ్డి, మద్దూర్ వెంకట్, గోవర్ధన్ రెడ్డి, గొల్ల మల్లన్న, నాగన్న, చందు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments