యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి

యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి

*యాగంటికి మాజీ ఎంపీ నామ, మాజీ ఎమ్మెల్యే సండ్ర ఘన నివాళ్లు*

- *ప్రజా నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు - మాజీ ఎంపీ నామ*

- *యాగంటి శ్రీను బౌతికకాయానికి నివాళ్లు అర్పిస్తూ బావోద్వేగానికి లోనైనా మాజీ ఎంపీ నామ*

ఖమ్మం బ్యూరో, జనవరి 8 (తెలంగాణ ముచ్చట్లు)

సత్తుపల్లి రూరల్ బీఆర్ఎస్  మండల పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు  మృతి పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. గురువారం నాడు యాగంటి శ్రీను మరణ వార్త తెలిసిన వెంటనే నామ తన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హుటాహుటిన సత్తుపల్లి బయలుదేరి రామానగరంలోని వారి స్వగృహానికి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి వెళ్లారు. అక్కడ యాగంటి శ్రీను పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ మాజీ ఎంపీ నామ బావోద్వేగానికి లోనయ్యారు. శ్రీను మంచి ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అలాంటి నాయకుడి మృతి బీఆర్ఎస్ పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటన్నారు. ఆయన పార్టీకి అలానే బీసీ నేతగా  ఆయన చేసిన సామాజిక సేవ కార్యక్రమాలను కొనియాడటంతో పాటుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నామ గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమం లో మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, మాజీ సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ ఆత్మ కమిటీ  చైర్మన్ లు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, వనమా వాసు, మాజీ జడ్పీటీసీ కూసంపూడి రామారావు, పట్టణ పార్టీ ప్రిసిడెంట్ షేక్ రఫీ, మాజీ కౌన్సిలర్ చంద్ పాషా, యూత్ నాయకులు వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, సుంకర వాసు, మధిర మాజీ సొసైటీ చైర్మన్ బిక్కీ కృష్ణప్రసాద్, మధిర మండలం మహాదేవపురం గ్రామ సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు మొండితోక జయకర్, యాస రాంబాబు, ఎమ్ నాగేశ్వరరావు, కామా శాంసన్, యం. వెంకటేశ్వరరావు, సాలి విజయ్, పాల్వంచ రాజేష్, రేగళ్ల కృష్ణప్రసాద్, హరీష్ తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు